లక్నో: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ సత్సంగ్ లో తొక్కిసలాట.. 80మందికి పైగా చనిపోయారు..150 మందికిపైగా గాయపడ్డారు. జూన్ 2, 2024న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఓ భయానక దృ శ్యం. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈఘటన పై విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన తర్వాత ఈ సత్సంగ్ ( మత ప్రార్థనల సమా వేశం) నిర్వహించింది ఎవరు..? ఎందుకింత మంది భక్తుల తరలివచ్చారు. నిర్వహించిన వ్యక్తి అంత ఫేమస్సా.. ఎందుకీ తొక్కిసలాట జరిగింది.. అనే సందేహాలు అందరికి వస్తున్నాయి.
విశ్వహరి భోలే బాబా.. హత్రాస్ జిల్లా సికిందర్ రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతీభాన్ పూర్ గ్రామంలో ఈ సత్సంగ్ ను నిర్వహించారు. ఇతని పేరు సౌరభ్ కుమార్..ఇతను గతంలో ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ నిఘా విభాగంలో పనిచేశారు. 17యేండ్లు సర్వీస్ చేసిన తర్వాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి బోధకుడిగా ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాడు. అతను తెల్లటి సూట్, టైలో పాఠాలు చెబుతూ కనిపిస్తాడు. అతని భార్యతో కలిసి సత్సంగ్ నిర్వహిస్తున్నాడు.పటియాలీ సాకర్ విశ్వ హరి బాబా గా కూడా పిలుస్తారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు వేలంలో భక్తులు హాజరవుతుంటారు.
మంగళవారం మధ్యాహ్నం బాబా నిర్వహించిన సత్సంగ్ లో వేలాది మంది పాల్గొన్నారు. సత్సంగం ముగిశాక ప్రజలు వేదిక నుంచి బయటికి వస్తుండగా ఈ తొక్కిసలాట జరిగింది. మహిళలు, పిల్లలతో సహా 80 మందిచనిపోయారు.పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్యం పెరిగే అవకాశం ఉంది. సత్సంగ్ ముగిసిన తర్వాత బయటికి వస్తుండగా ఒకరిని ఒకరు తోసుకోవడంతో పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.